దసరాకి పెళ్లి సందడి - Telugu News Pelli SandaD Plans To Release On Dasara
close
Updated : 22/09/2021 07:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దసరాకి పెళ్లి సందడి

దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నటుడు శ్రీకాంత్‌ కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రం ‘పెళ్లి సందడి’. ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా మరో ‘పెళ్లి సందదీ’ని తీసుకొస్తున్నారు రాఘవేంద్రరావు. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా నటిస్తున్నారు. గౌరీ రోణంకి తెరకెక్కిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలు. ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం మంగళవారం ప్రకటించింది.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘కుటుంబ సమేతంగా కలిసి చూడదగ్గ చిత్రమిది. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్‌ యు సర్టిఫికెట్‌ అందుకున్నాం. దసరాకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. బుధవారం మహేష్‌బాబు చేతుల మీదుగా చిత్ర ట్రైలర్‌ విడుదల చేయనున్నాం’’ అన్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని