రష్మిక... ఓ కల - Telugu News Rashmika wants to act in the biopic on Soundarya
close
Updated : 17/09/2021 07:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రష్మిక... ఓ కల

నటులు తెరపై ఎన్నో రకాల పాత్రల్లో ఒదిగిపోతుంటారు. అయితే వ్యక్తిగతంగా వాళ్లకంటూ కొన్ని కలల పాత్రలంటూ ఉంటాయి. ఎప్పటికైనా ఆ పాత్రల్లో నటించాలని ఆశ పడుతుంటారు. రష్మికకీ కలల పాత్రలు చాలానే ఉన్నాయట. అందులో ఒకటి సౌందర్యలా నటించడం! దక్షిణాది ప్రేక్షకులపై తనదైన ముద్రవేసిన నిన్నటితరం కథానాయిక సౌందర్య. ఆమెనే స్ఫూర్తిగా తీసుకొని సినీ రంగంలోకి వచ్చిన నాయికలెందరో. రష్మిక సౌందర్య అభిమానే. చిన్నప్పుడు కుటుంబ సభ్యులు సౌందర్యలా ఉంటావని చెప్పేవారట. అందుకే ఆమె పాత్రలో నటించాలని ఉందంటోంది రష్మిక. ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. ఈ సందర్భంగా బయోపిక్‌ల ప్రశ్న ఎదురైనప్పుడు... ‘‘నాకు సౌందర్య బయోపిక్‌లో నటించాలనే ఆశ ఉంది. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా’’ అని బాలీవుడ్‌ మీడియాతో చెప్పింది రష్మిక.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని