అటు... ఇటు రెజీనానే! - Telugu News Regina Starter Nenena Trailer Out Now
close
Updated : 15/09/2021 12:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అటు... ఇటు రెజీనానే!

రెజీనా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘నేనే నా..?’. కార్తీక్‌రాజు దర్శకత్వం వహించారు. రాజ్‌శేఖర్‌ వర్మ నిర్మాత. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ని నిధి అగర్వాల్‌, విజయ్‌ సేతుపతి, లింగుస్వామి ఆవిష్కరించారు. ట్రైలర్‌లో రాణిగా... పురాతన విషయాల్ని పరిశోధించే శాస్త్రవేత్తగా రెండు పాత్రల్లో కనిపిస్తోంది రెజీనా. వందేళ్ల క్రితం జరిగిన సంఘటనలకీ, ప్రస్తుత కథని ముడిపెడుతూ ఈ సినిమాని తెరకెక్కించినట్టు స్పష్టమవుతోంది. ‘‘హారర్‌, కామెడీతోపాటు ఓ రహస్యమైన అంశం మేళవింపుతో సాగే చిత్రమిది. తెలుగులో ‘నిను వీడని నీడని నేనే’ తీసి విజయాన్ని అందుకున్న కార్తీక్‌ రాజు, ‘జాంబీరెడ్డి’ తర్వాత నిర్మాత రాజశేఖర్‌ వర్మ కలిసి ఈ చిత్రాన్ని రూపొందించారు. సామ్‌ సీఎస్‌ సంగీతం, గోకుల్‌ బెనాయ్‌ కెమెరా పనితనం చిత్రానికి ప్రధాన బలమ’’ని తెలిపాయి సినీ వర్గాలు. వెన్నెల కిశోర్‌, అక్షరగౌడ, తాగుబోతు రమేశ్‌, జయప్రకాష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: గోకుల్‌ బినోయ్‌, మాటలు: ఏఆర్‌.ప్రభవ్‌.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని