‘రౌడీ బాయ్స్‌’ ప్రేమకథ - Telugu News Rowdy Boys Teaser Out Now
close
Updated : 21/09/2021 09:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రౌడీ బాయ్స్‌’ ప్రేమకథ

శిష్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా హర్ష కొనుగంటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘రౌడీ బాయ్స్‌’. దిల్‌ రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శశిదేవ్‌ విక్రమ్‌, కార్తిక్‌ రత్నం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర  టీజర్‌ను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దిల్‌రాజు, దేవీశ్రీప్రసాద్‌ పాల్గొన్నారు. కాలేజీ ప్రేమలు.. ఆ ప్రేమ కోసం విద్యార్థుల మధ్య జరిగే కొట్లాటలు తదితర అంశాల నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కినట్లు ప్రచార చిత్రాన్ని బట్టి అర్థమవుతోంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చగా, మది సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ...‘‘ఇది పూర్తి యూత్‌ఫుల్‌ చిత్రం. ఆశిష్‌ కొత్తవాడిగా కాకుండా బాగా చేశాడు. అనుమపను చూసి ఆశ్చర్యపోతారు. దసరాకు చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని యోచిస్తున్నాం. అందరూ వచ్చి కొత్త వారిని ఆశీర్వదించండి’’ అన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని