‘గూడుపుఠాణి’ మెప్పిస్తుంది - Telugu News Saptagiri Starer Guduputani Pre release Event
close
Updated : 17/09/2021 07:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘గూడుపుఠాణి’ మెప్పిస్తుంది

చిత్ర పరిశ్రమకి కొత్త తరం రావల్సిన అవసరం ఎంతో ఉందన్నారు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌. ఆయన ముఖ్య అతిథిగా హైదరాబాద్‌లో ‘గూడుపుఠాణి’ విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. సప్తగిరి, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రమిది. కె.యమ్‌.కుమార్‌ దర్శకత్వం వహించారు. పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, కటారి రమేష్‌ నిర్మించారు. త్వరలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ‘‘తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది వారసత్వంతో తెరపైకొచ్చారు. సప్తగిరికి ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా హీరో స్థాయికి చేరుకున్నాడు. కష్టపడి చేసిన ఈ చిత్రం అందరికీ మంచి ఫలితాన్ని తీసుకొస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు. సప్తగిరి మాట్లాడుతూ ‘‘నేను ఇప్పటి వరకు హీరోగా థ్రిల్లర్‌ సినిమా చేయలేదు. సూపర్‌స్టార్‌ కృష్ణ నటించిన ‘గూడుపుఠాణి’ పేరుతో నేను సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఇందులో రఘు కుంచె ప్రతినాయకుడిగా చేయడం మాఅదృష్టం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంథోల్‌ ఎమ్మెల్యే క్రాంతికుమార్‌, దర్శకుడు మారుతి, రాం భూపాల్‌, అలీ, ధన్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని