‘మహా సముద్రం’లో ప్రేమ గీతిక - Telugu News Second Song From Mahasamudram Will Release On sep 6
close
Updated : 04/09/2021 07:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మహా సముద్రం’లో ప్రేమ గీతిక

ర్వానంద్‌, సిద్ధార్థ్‌ కథానాయకులుగా దర్శకుడు అజయ్‌ భూపతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహా సముద్రం’. సుంకర రామబ్రహ్మం నిర్మాత. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్‌కథానాయికలు.చైతన్యభరద్వాజ్‌ స్వరాలందించారు.ఈ సినిమా అక్టోబరు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఈ నేపథ్యంలోనే ఈనెల 6న సినిమాలోని ‘‘చెప్పకే.. చెప్పకే..’’ అంటూ సాగే రెండో గీతాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం పాటకు సంబంధించిన ఓ పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆ పోస్టర్‌లో అదితి రావు క్యూట్‌ లుక్‌లో సముద్ర ఒడ్డున వర్షంలో కూర్చొని కనిపించింది. గాఢమైన ప్రేమకథతో.. యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమాకి  ఛాయాగ్రహణం: రాజ్‌ తోట.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని