వెన్నెల్లో ఆడపిల్ల - Telugu News VennelloAadapilla Full Video Song Out From Maestro
close
Updated : 07/08/2021 06:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెన్నెల్లో ఆడపిల్ల

నేరుగా ఓటీటీలో విడుదల కానున్న సినిమాల్లో నితిన్‌ ‘మాస్ట్రో’ ఒకటి. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్‌కి జోడీగా నభా నటేష్‌ నటించింది. తమన్నా ముఖ్యభూమిక పోషించారు. ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మాతలు. ఇందులోని ‘వెన్నెల్లో ఆడపిల్ల...’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు. మహతి స్వరసాగర్‌ స్వరపరిచిన ఈ గీతానికి శ్రీజో, కృష్ణచైతన్య సాహిత్యం అందించారు. స్వీకర్‌ అగస్తి ఆలపించారు. ‘‘గోవా నేపథ్యంలో నితిన్‌, నభా మధ్య సాగే అందమైన పాట ఇది. కథలోని చాలా ఆసక్తికరమైన విషయాలు ఈ పాటతోనే వెలుగులోకి వస్తాయి. తమన్నాతోపాటు జిషుసేన్‌ గుప్తా, మంగ్లీలని కూడా ఈ పాటలో చూడొచ్చ’’ని చెప్పింది చిత్రబృందం. శ్రీముఖి, అనన్య, హర్షవర్ధన్‌, రచ్చరవి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: యువరాజ్‌.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని