రామోజీ ఫిల్మ్‌సిటీలో కార్తి.. త్రిష - Telugu News ponniyin selvan Shooting Going On At Ramojifilm City
close
Updated : 07/08/2021 07:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రామోజీ ఫిల్మ్‌సిటీలో కార్తి.. త్రిష

ద్భుతమైన చోళ రాజ్యం..అందులో పరాక్రమ రాకుమారుడు...అందమైన సుందరీమణులు...వీళ్ల మధ్య ఓ పాట... ఇలాంటి అలరించే సన్నివేశానికి రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికైంది. చోళ రాజుల కథతో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తోన్న చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. విక్రమ్‌, కార్తి, ఐశ్వర్యరాయ్‌, త్రిష, శోభిత ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. కార్తి, త్రిష, శోభితతో పాటు 200 మంది డ్యాన్సర్లపై గ్రేప్‌ గార్డెన్‌ రోడ్‌లో ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. బృంద మాస్టర్‌ ఈ గీతానికి నృత్యరీతులు సమకూరుస్తున్నారు. ఈ సినిమా తొలి భాగం ‘పీఎస్‌ 1’ వచ్చే ఏడాది విడుదల కానుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని