షారుక్‌... సంజూ భాయ్‌ కలిస్తే! - Telugu-News shahrukh and sanjay dutt will act in a movie
close
Updated : 15/07/2021 10:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

షారుక్‌... సంజూ భాయ్‌ కలిస్తే!

ముంబయి: కొన్ని కలయికలు సినిమాపై అంచనాలు పెంచుతాయి. వెండితెరపై బలంగా తమ ప్రభావాన్ని చూపించే ఇద్దరు వ్యక్తులు ఒకే సినిమాలో  నటిస్తుంటే ఆ క్రేజే వేరుగా ఉంటుంది. త్వరలో బాలీవుడ్‌లో అలాంటి ఓ కలయికను ప్రేక్షకులు చూడబోతున్నారు. అగ్ర కథానాయకుడు షారుక్‌ఖాన్, ప్రముఖ నటుడు సంజయ్‌దత్‌ కలిసి నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి ‘రాఖీ’ అనే పేరుని అనుకుంటున్నట్టు సమాచారం. దర్శకుడు, నిర్మాతలు  ఎవరనేది కొన్ని రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. గతంలో షారుఖ్‌ చిత్రం ‘రా వన్‌’ ప్రారంభ సన్నివేశంలో తళుక్కున మెరిశారు సంజయ్‌. ఆ తర్వాత సంజయ్‌ ‘ఓం శాంతి ఓం’లో షారుఖ్‌తో కలిసి ఓ పాటలో కాలు కదిపారు. తెర వెనుక షారుక్, సంజయ్‌ మధ్య సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరూ పూర్తిస్థాయి చిత్రంలో నటిస్తుంటే అభిమానులకు చూడముచ్చటగానే ఉంటుందంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని