దీపావళికి ‘గని’ పంచ్‌ - Telugu News varuntej New Movie ghani Release Date Announcement
close
Updated : 06/08/2021 09:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దీపావళికి ‘గని’ పంచ్‌

దీపావళికి బాక్సర్‌గా తన పంచ్‌ పవర్‌ రుచి చూపించనున్నారు హీరో వరుణ్‌ తేజ్‌. బాక్సింగ్‌ నేపథ్య కథతో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి దర్శకుడు. సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సయీ మంజ్రేకర్‌ కథానాయిక. ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, నవీన్‌ చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి.. దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు గురువారం రిలీజ్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ‘‘తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి అందించేలా చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాం. ఇందులో వరుణ్‌ బాక్సర్‌గా కనిపిస్తారు. ఈ పాత్ర కోసం ఆయన తన లుక్‌ పూర్తిగా మార్చుకున్నారు’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: జార్జ్‌ సి.విలియమ్స్‌.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని