Raghavendra Rao: యాదాద్రి వైభవంపై సినిమా తీస్తా - Telugu news I Want To Make A Movie On Yadadri Says Raghavendra rao
close
Updated : 17/10/2021 07:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Raghavendra Rao: యాదాద్రి వైభవంపై సినిమా తీస్తా

- కె.రాఘవేంద్రరావు

యాదాద్రిపై ఆధ్యాత్మిక చలనచిత్రాన్ని తీయాలని కోరిక ఉందని ప్రముఖ సినీ దర్శకేంద్రుడు, నిర్మాత కె.రాఘవేంద్రరావు తెలిపారు. పాతికేళ్ల క్రితం శ్రీకాంత్‌ కథానాయకుడిగా పెళ్లిసందడి తెరకెక్కించా.. ఇప్పుడేమో ఆయన కొడుకుతో తీసిన ‘పెళ్లి సంద‘డి’ చిత్రంలో చిన్న వేషం వేశానన్నారు. విజయదశమి సందర్భంగా శుక్రవారం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ఆయన సందర్శించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదాద్రి క్షేత్రం భవిష్యత్తులో మరో తిరుమలగా పేరొందుతుందని, కృష్ణశిలతో రూపొందించడం మహాత్కార్యంగా రాఘవేంద్రరావు అభివర్ణించారు. సీఎం కేసీఆర్‌ది మహాయజ్ఞమని వ్యాఖ్యానించారు. 

* రోషన్‌, శ్రీలీల జంటగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ‘పెళ్లి సందడి’. గౌరి రోణంకి తెరకెక్కించారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని  సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘‘కుటుంబ కథా చిత్రాలను చూడాలనుకునే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాని ఎంజాయ్‌ చేస్తున్నారని డిస్టిబ్యూటర్స్‌ చెబుతున్నారు. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న సినీప్రియులకు థ్యాంక్స్‌’’ అన్నారు.

- న్యూస్‌టుడే, యాదగిరిగుట్ట



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని