KTR: ప్రపంచ ఆర్థిక వార్షిక సదస్సుకు కేటీఆర్‌ - Telugu news KTR‌ to the World Economic Forum summit
close
Published : 20/09/2021 08:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

KTR: ప్రపంచ ఆర్థిక వార్షిక సదస్సుకు కేటీఆర్‌

ఆహ్వానించిన వేదిక ఛైర్మన్‌ బోర్గ్‌ బెండె

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చేఏడాది జనవరి 17 నుంచి 21వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు-2022కు హాజరు కావాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆదివారం ఆయనకు వేదిక అధ్యక్షుడు బోర్గ్‌ బెండె లేఖ రాశారు. రాష్ట్రాన్ని సాంకేతికతకు రారాజుగా, మహాశక్తి కేంద్రంగా కేటీఆర్‌ నిలిపారని లేఖలో పేర్కొన్నారు. ఆయన నాయకత్వం.. కరోనా నుంచి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవటానికి దార్శనికతను చూపిందన్నారు. వీటన్నింటికీ గుర్తింపుగా ఆయనను తమ వార్షిక సదస్సుకు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ‘‘అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను అందిపుచ్చుకోవడంతో పాటు వాటిని ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం, సామర్థ్యం పెంపుదల, సహకార మార్గాలపై మీ అభిప్రాయాలను వార్షిక సదస్సులో అందరితో పంచుకోవాలి’’ అని బోర్గ్‌ కోరారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి రాజకీయ, వ్యాపార- పౌరసమాజ నాయకులు పాల్గొనే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు తనను ఆహ్వానించడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆహ్వానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, పరిశ్రమలు, ఆవిష్కరణ రంగాల్లో కనబరుస్తున్న ప్రతిభకు దక్కిన గౌరవంగా భావిస్తామన్నారు. తెలంగాణ పారిశ్రామిక అనుకూల విధానాలను ప్రపంచవేదిక వద్ద ప్రస్తావించి ప్రపంచస్థాయి సంస్థల పెట్టుబడులను ఆకర్షించేందుకు ఒక అవకాశంగా మలుచుకుంటామని చెప్పారు. 2020 జనవరిలోనూ కేటీఆర్‌ వేదిక వార్షిక సదస్సుకు హాజరయ్యారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని