Family Drama: ఓటీటీలో ‘ఫ్యామిలీడ్రామా’ - Telugu news family drama Trailer out now
close
Published : 25/10/2021 14:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Family Drama: ఓటీటీలో ‘ఫ్యామిలీడ్రామా’

సుహాస్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ డ్రామా’. మెహెర్‌ తేజ్‌ దర్శకత్వం వహించారు. తేజా కాసరపు, మెహర్‌తేజ్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఓటీటీ వేదిక సోని లివ్‌లో ఈ నెల 29న విడుదల కానుంది. గురువారం   ట్రైలర్‌ని విడుదల చేశారు. కథానాయకుడు సుహాస్‌ హత్యలు చేసే సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తించాయి. ‘‘ప్రతి చిన్న విషయానికి తండ్రి తిడుతున్నాడనే కారణంగా ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఓ అబ్బాయి... తన ఇంట్లో పరిస్థితులు నచ్చక బయటికి వచ్చేసిన ఓ అమ్మాయి... ఈ ఇద్దరూ ఎలా కలిశారు? వాళ్లకి సుహాస్‌ ఎలా సాయం చేశాడనేదే ఈ కథ’’ అని సినీ వర్గాలు తెలిపాయి. తేజ కాసరపు, పూజా కిరణ్‌, అనూష నూతుల, శ్రుతిమెహర్‌, సంజయ్‌ రథా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజయ్‌.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని