close

తాజా వార్తలు

మీనా, ఖుష్బూతో కలిసి రజనీ సందడి

తలైవా@168 షురూ!

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కొత్త సినిమా షురూ అయ్యింది. ‘దర్బార్‌’ తర్వాత తలైవా 168వ సినిమాకు సంతకం చేశారు. శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నటీనటుల వివరాల్ని నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ మంగళవారం ప్రకటించింది. కీర్తి సురేశ్‌, మీనా, ఖుష్బూ, ప్రకాశ్‌రాజ్‌, సూరి ప్రధాన పాత్రలు పోషించబోతున్నట్లు వెల్లడించింది. బుధవారం ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకల్ని నిర్వహించారు. రజనీ, మీనా, ఖుష్బూతోపాటు ఇతర యూనిట్‌ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోల్ని సన్‌ పిక్చర్స్‌ సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది.

ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో రజనీ నటించిన సినిమా ‘దర్బార్‌’. నయనతార కథానాయిక. నివేదా థామస్‌, సునీల్‌శెట్టి, యోగిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.