close

తాజా వార్తలు

Published : 24/11/2020 11:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మూడో చిత్రంతో ఒత్తిడి: తరుణ్‌ భాస్కర్‌

హైదరాబాద్‌: 2016లో ‘పెళ్లి చూపులు’ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌. తన మొదటి చిత్రంతోనే బెస్ట్‌ స్క్రీన్ ప్లే, మాటలకు జాతీయ అవార్డులు అందుకున్నారు. 2018లో ఆయన నిర్మించిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి మంచి స్పందన లభించింది. ఇప్పటికీ ఈ చిత్రంలోని మాటలు ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయాయి. అభిమానులు ఎంతగానో ఆసక్తితో ఎదురుచూస్తున్న తన మూడో చిత్రం గురించి తాజాగా ఆయన కొన్ని విషయాలు చెప్పారు.   

‘ఈ మూడో చిత్రం నన్ను సమస్యల్లో పడేసింది. ఈ అసహనం నన్ను దాదాపుగా చంపేసింది. రెండు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ఏది ఎంచుకోవాలో అర్థం అయ్యేది కాదు. ఇంతకు ముందుకంటే ఇప్పుడు ఒత్తిడి ఎక్కువగా ఉంది. అదే విధంగా ఎంతగానో ఆలోచించిన తర్వాత ఓ క్రైమ్ డ్రామాను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాను. ఈ కథ నన్ను ఎంతో ఆకర్షించింది. ఇది యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కనుంది. అంతేకాకుండా నేను అభిమానించే స్టార్‌తో పని చేయబోతున్నాను. ఈ చిత్రం గురించి త్వరలో బయటపెడతాను. ఈ సారి మిమ్మల్ని నిరాశపరచను’ అని తరుణ్‌ తెలిపారు.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన