అది తెలిసే అలా చేశాం: కోహ్లీ - That was gift for Sachin Tendulkar from all of the people says Virat Kohli
close
Updated : 30/07/2020 11:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అది తెలిసే అలా చేశాం: కోహ్లీ

ఓపెన్‌ నెట్స్‌ విత్‌ మయాంక్‌తో టీమ్‌ఇండియా సారథి

ఇంటర్నెట్‌డెస్క్‌: ధోనీ సారథ్యంలోని టీమ్‌ఇండియా 2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచినప్పుడు యావత్‌ దేశం మురిసిపోయింది. ఎందుకంటే అంతకు నాలుగు నెలల ముందే భారత్‌ వన్డే ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలమైంది. ఇక 2011కు నాటికి అందరి దృష్టీ సచిన్‌ మీదే నెలకొంది. తన చిరకాల స్వప్నం నెరవేర్చుకోవాలంటే అదే అతడికి చివరి అవకాశం. దీంతో ఎలాగైనా గెలవాలని ధోనీసేన నిర్ణయించుకుంది. క్వార్టర్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాను, సెమీస్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్‌ చివరికి ఫైనల్లో శ్రీలంకనూ ఓడించింది. అలా 1983 తర్వాత వన్డేల్లో రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. అనంతరం ఆటగాళ్లంతా లిటిల్‌ మాస్టర్‌ను తమ భుజాలపై ఎక్కించుకొని వాంఖడే స్టేడియంలో గౌరవ వందనం అందించారు. ఆ మధురక్షణాలను ప్రస్తుత సారథి విరాట్‌ కోహ్లీ తాజాగా గుర్తు చేసుకున్నాడు. ఓపెన్‌ నెట్స్‌ విత్‌ మయాంక్‌ రెండో భాగంలో మాట్లాడుతూ ఆ సంఘటనపై స్పందించాడు. ఆ వీడియోను బీసీసీఐ వెబ్‌సైట్‌లో పోస్టు చేసింది.

అప్పుడు టీమ్‌ఇండియా విజేతగా నిలవడం తనకు సంతోషం కలిగించిందని, దాన్నెంతో ఆస్వాదించానని కోహ్లీ వెల్లడించాడు. మ్యాచ్‌ గెలిచాక ఆటగాళ్లందరూ సచిన్‌ గురించే ఆలోచించారని, అతనికి అదే చివరి ప్రపంచకప్‌ కావడంతో ఘన వీడ్కోలు ఇవ్వాలనుకున్నట్లు తెలిపాడు. లిటిల్‌మాస్టర్‌ దేశం కోసం ఎంతో చేశాడని, అటువంటి వ్యక్తి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడని పేర్కొన్నాడు. దాంతో తాము కూడా అతనికి తిరిగి ఏదైనా ఇవ్వాలనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ‘పాజీని మా భుజాలపై ఎత్తుకొని తిరగడం మేం ఇచ్చిన మంచి బహుమతి (జ్ఞాపకం)‌. ఎందుకంటే టీమ్‌ఇండియాకు అలాంటివి అతనెప్పుడూ ఇస్తూనే ఉన్నాడు. మేం కూడా తన సొంత మైదానంలో అలా గౌరవించాలని భావించాం. అదే సరైన పద్ధతని నిర్ణయించుకొని అలా చేశాం’ అని కోహ్లీ స్పష్టంచేశాడు. కాగా, ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 274/6 స్కోర్‌ చేసింది. జయవర్ధనే(103) శతకంతో నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం టీమ్‌ఇండియా 48.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ధోనీ(91 నాటౌట్‌), గంభీర్‌(97) రాణించారు. ఇక కోహ్లీ (35) పరుగులకే ఔటైనా మూడో వికెట్‌కు గంభీర్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నిర్మించాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని