బేర్‌గ్రిల్స్‌తో అక్షయ్‌.. న్యూ టీజర్‌ చూశారా? - The Wild With Bear Grylls akshay kumar new episode new teaser
close
Published : 31/08/2020 16:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బేర్‌గ్రిల్స్‌తో అక్షయ్‌.. న్యూ టీజర్‌ చూశారా?

ఇంటర్నెట్ డెస్క్‌: యాక్షన్‌ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్‌ ‘ఖిలాడీ’ అక్షయ్‌కుమార్‌ ప్రముఖ సాహస యాత్రికుడు బేర్‌ గ్రిల్స్‌తో కలిసి సాహసాలు చేయనున్నాడు. ఇటీవల అతడితో కలిసి చిత్రీకరించిన సాహసయాత్ర ఎపిసోడ్‌ టీజర్‌ అభిమానులను ఆకట్టుకోగా, ఇప్పుడు మరో టీజర్‌ను విడుదల చేశారు.

ఇందులో యాక్షన్‌ ఫిల్మ్స్‌ కథానాయకుడిగా బేర్‌గ్రిల్స్‌ అక్షయ్‌ను పరిచయం చేశారు. వెంటనే అక్షయ్‌ స్పందిస్తూ.. ‘నేను రీల్‌ హీరో.. ఆయన రియల్‌ హీరో’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియోను అభిమానులతో పంచుకున్న అక్షయ్‌.. ‘బేర్‌గ్రిల్స్‌తో సాహసయాత్ర నాకు సవాల్‌తో కూడుకున్నదే. ‘ఏనుగు టీ’తో నన్ను ఆశ్చర్యపరిచారు’ అంటూ చెప్పుకొచ్చారు.

ఈ సాహసయాత్ర ఎపిసోడ్‌ సెప్టెంబర్‌ 11న డిస్కవరీ ప్లస్‌ యాప్‌లో విడుదల కానుంది. సెప్టెంబర్‌ 14న డిస్కవరీ ఛానల్‌లో ప్రసారం కానుంది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, నటుడు రజనీ కాంత్‌లు బేర్‌ గ్రిల్స్‌తో కలిసి సాహసయాత్ర చేశారు. వారి తర్వాత ఈ యాత్ర చేసిన మూడో భారతీయుడిగా అక్షయ్‌ నిలిచాడు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని