‘గబ్బర్‌ సింగ్‌’ను ఉద్దేశించి అలా అనలేదు: శ్రుతి - They were misinterpreted Shruti Haasan about comments on south film industry
close
Published : 07/10/2020 02:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘గబ్బర్‌ సింగ్‌’ను ఉద్దేశించి అలా అనలేదు: శ్రుతి

నన్ను అపార్థం చేసుకున్నారు

హైదరాబాద్‌: దక్షిణాది చిత్ర పరిశ్రమలో కమర్షియల్‌ సినిమాల్లో నటించడం గురించి ఓ ఇంటర్వ్యూలో తను చెప్పిన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని కథానాయిక శ్రుతి హాసన్‌ పేర్కొన్నారు. ఈ భామ తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో లాక్‌డౌన్‌లో కాలక్షేపం, బాలీవుడ్‌లో విరామం, సినిమాల ఎంపిక గురించి ముచ్చటించారు. కమర్షియల్‌ సినిమాల గురించి ప్రస్తావిస్తూ.. కేవలం కమర్షియల్‌ సినిమాలు మాత్రమే తీద్దామని చెప్పే వ్యక్తుల మాటలు విననని అన్నారు. కొన్ని బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో నటించానని, కానీ వాటిని గొప్పగా ఆస్వాదించలేదని చెప్పారు. ఇంకా ఉత్తమమైన కంటెంట్‌ను ఎంచుకోవాలని అభిప్రాయపడ్డారు. అయితే ఆమె కెరీర్‌లో హిట్లుగా నిలిచిన ‘గబ్బర్‌ సింగ్‌’, ‘రేసు గుర్రం’ సినిమాల గురించి ఇలా మాట్లాడారని అపార్థం చేసుకుని కొన్ని వెబ్‌సైట్లు రాశాయి. వీటిపై శ్రుతి స్పష్టత ఇచ్చారు.

‘నేను ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటల్ని కొన్ని తెలుగు వెబ్‌సైట్లు తప్పుగా అర్థం చేసుకున్నాయి. వీళ్లు రాసిన వార్తల్లో వాస్తవం లేదు. వాటిపై స్పష్టత ఇవ్వాలి అనుకుంటున్నా. ‘రేసు గుర్రం’, ‘గబ్బర్‌ సింగ్’ లాంటి సినిమాల్లో నటించడాన్ని ఎప్పటికీ గర్వంగా భావిస్తాను. పవన్‌ కల్యాణ్‌ గారితో కలిసి నటించిన ‘గబ్బర్‌ సింగ్‌’ నా జీవితాన్ని మార్చేసింది. తెలుగు, దక్షిణాది చిత్రాల్లో నా భాగస్వామ్యం ఉండటమంటే.. నేను నా హృదయానికి దగ్గరగా ఉండటమే (దక్షిణాదిని హృదయంతో పోల్చుతూ). నేను నటించిన హిందీ సినిమాలను ఉద్దేశించి ఆ రోజు ఇంటర్వ్యూలో మాట్లాడా’ అని శ్రుతి ట్వీట్లు చేశారు. భారత చిత్ర పరిశ్రమలో ‘సౌత్‌ వర్సెస్‌ హిందీ’ అని మాట్లాడే విషయాలు తనకు ఏ మాత్రం నచ్చవని, ఇప్పుడైనా తనను పూర్తిగా అర్థం చేసుకున్నట్లు ఆశిస్తున్నానని పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని