ఆలియా, అనన్యా, సారా ఇంకా.. రోనిత్ ఆష్రా‌! - This boy mimics any actress in bollywood
close
Updated : 13/09/2020 15:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆలియా, అనన్యా, సారా ఇంకా.. రోనిత్ ఆష్రా‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: నెట్టింట్లో సినీ నటులను అనుకరించే వారికి కొదవలేదు. అసలు ప్రముఖ నటీ, నటులను అనుకరించడం అనేది ఎప్పటి నుంచో ఉంది. అయితే తనను తాను ‘బోయ్‌ ఇన్‌ ఏ విగ్‌’ గా పిలుచుకునే రోనిత్‌ ఆష్రా రూటే సెపరేటు.. ఈ 16ఏళ్ల అబ్బాయి నటీమణుల అనుకరణతో ఇన్‌స్టాగ్రామ్‌ సంచలనంగా నిలిచాడు. మరి అతని ప్రత్యేకత ఏంటంటే..

బాలీవుడ్‌ హీరోయిన్లు అలియా భట్, అనన్యా పాండే, సారా ఆలీ ఖాన్‌, కరీనా.. ఒక్కరేంటి ఎవరి హావభావాలనైనా అచ్చుగుద్దినట్టు రోనిత్‌ ప్రదర్శిస్తూ ఉంటారు. ఒక్కోసారి అసలెవరో నకిలీ ఎవరో పోల్చుకోలేమంటే అతిశయోక్తి కాదు. మామూలుగా సినీనటులకు సంబంధించిన మిమిక్రీ చేసేవారు వారి కంఠస్వరాన్ని, హావభావాలను అనుకరిస్తారు. అయితే రోనిత్‌ సినిమాల్లో వారి నటన, మాటలు, స్టైల్‌ని మాత్రమే కాకుండా బాడీ లాంగ్వేజ్‌, అలవాట్లు, మేనరిజం.. ఇలా దేన్నీ వదలకుండా అనుకరించడం ఇతని స్పెషాలిటీ. వివిధ ఇంటర్వ్యూలు, టీవీ షోలలో మాట్లాడుతున్నప్పుడు వారి అసలైన హావభావాలను ఇట్టే పట్టేయటం ఇతనికి కొట్టిన పిండి. మరి అది నిజమో, కాదో మీరే ఈ వీడియోలో చూడండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని