‘నారప్ప’ షురూ.. ‘రంగ్‌దే’ నుంచి మెలోడి.. - Tollywood new Movies Latest Update
close
Updated : 06/11/2020 20:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నారప్ప’ షురూ.. ‘రంగ్‌దే’ నుంచి మెలోడి..

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా నుంచి చిత్రపరిశ్రమ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. సినిమా షూటింగ్‌లు నెమ్మదిగా ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే నాగార్జున, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్‌తో పాటు పలువురు కథానాయకులు షూటింగ్‌లలో పాల్గొంటుండగా, త్వరలోనే చిరంజీవి కూడా ‘ఆచార్య’ కోసం రంగంలోకి దిగినున్నట్లు తాజాగా ప్రకటించారు.

ఇక వెంకటేశ్‌ కథానాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నారప్ప’. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్‌ గురువారం ప్రారంభమైంది. చిత్ర బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. తమిళ సూపర్‌హిట్‌ ‘అసురన్‌’ రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. తాజా షెడ్యూల్‌తో 80శాతం చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం.


నితిన్‌, కీర్తిసురేశ్‌ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రంగ్‌దే’. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో ‘ఏమిటో ఇది’ అంటూ సాగే సాంగ్‌ లిరికల్‌ వీడియోను చిత్ర బృందం పంచుకుంది. పూర్తి వీడియోను నవంబరు 7న విడుదల చేయనున్నట్లు తెలిపింది.


సత్యదేవ్‌ కీలక పాత్రలో నాగశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. తమన్నా కథానాయిక. ఇప్పుడు ఈ చిత్రంలో మేఘా ఆకాశ్‌ కూడా నటించనున్నారు. చిత్ర బృందం ఈ విషయాన్ని వెల్లడించింది.


కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. శనివారం కమల్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ టీజర్‌ను విడుదల చేయనున్నారు. కమల్‌హాసన్‌ 232వ చిత్రంగా ఇది తెరకెక్కనుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని