షూటింగ్‌లో గాయపడ్డ స్టార్‌ - Tovino Thomas got injured on film sets
close
Published : 07/10/2020 17:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

షూటింగ్‌లో గాయపడ్డ స్టార్‌

కొచ్చి: మాలీవుడ్‌ స్టార్‌ టొవినో థామస్‌ చిత్రీకరణలో గాయపడ్డారు. ‘కాలా’ సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ యాక్షన్‌ సన్నివేశాన్ని తెరకెక్కిస్తుండగా ఆయన పొట్ట భాగానికి గాయమైంది. దీంతో ఆయన్ను చిత్ర బృందం కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. 24 గంటలపాటు థామస్‌ ఆరోగ్యాన్ని పరిశీలించిన అనంతరం వైద్యులు శస్త్ర చికిత్స చేయనున్నారట.

‘కాలా’ సినిమాకు వీఎస్‌ రోహిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘మెన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ నేపథ్యంలో ఈ సినిమాను తీస్తున్నట్లు ఇటీవల దర్శకుడు చెప్పారు. మాలీవుడ్‌లో విజయవంతంగా రాణిస్తున్న నటుల్లో థామస్‌ ఒకరు. ఆయన గతంలోనూ ఓ సినిమా సెట్‌లో గాయపడ్డారు. యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఆయన ఒంటికి నిప్పు అంటుకుంది. దానికి సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది. సన్నివేశాన్ని రక్తికట్టించేందుకు ఎంతటి సాహసానికైనా సిద్ధమయ్యే నటుడిగా ఆయనకు పేరుంది. ‘మారి 2’, ‘లూసీఫర్‌’ సినిమాలతో థామస్‌ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడయ్యారు. ఆయన నటించిన ‘ఫొరెన్సిక్‌’ చిత్రం ఓటీటీ వేదికగా ఇటీవల తెలుగులోనూ విడుదలైంది.





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని