అభినందన్‌పై వ్యాఖ్యలకు పాక్ నేతపై దేశద్రోహం కేసు! - Treason case on pak leader who made coments on abhinandan release
close
Published : 02/11/2020 11:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అభినందన్‌పై వ్యాఖ్యలకు పాక్ నేతపై దేశద్రోహం కేసు!

ఇస్లామాబాద్‌: భారత్‌ తమపై దాడి చేస్తుందని భయంతో వణికిపోయి.. వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను పాక్‌ విడుదల చేసిందని చెప్పిన ఎంపీ అయాజ్‌ సాధిఖ్‌పై దేశద్రోహం కేసు నమోదు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆయనపై దేశవ్యాప్తంగా పోలీసులకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని.. ఈ నేపథ్యంలో దేశద్రోహం కేసు నమోదు చేయాలన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నామని అంతర్గత వ్యవహారాల మంత్రి ఎజా షా తెలిపారు. సాదిఖ్‌ను ద్రోహిగా పేర్కొంటూ లాహోర్‌లో గోడపత్రికలు సైతం వెలిశాయి. దీనిపై ప్రతిపక్ష పీఎంఎల్‌-ఎన్‌ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. రాజకీయ కక్ష సాధింపుతోనే ప్రతిపక్ష నాయకులపై ప్రభుత్వం దేశద్రోహం కేసులు నమోదుచేస్తోందని ఆరోపించింది.  

మరోవైపు అభినందన్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని సాధిఖ్‌ ఉద్ఘాటించారు. తానెప్పుడూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. గతంలో జాతీయ భద్రత కమిటీకి అధిపతిగా వ్యవహరించిన తన వద్ద అనేక రహస్యాలు ఉన్నాయని తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని