త్వరలోనే ‘మేక సూరి 2’ వస్తుంది! - Trinath veliseala interview
close
Published : 02/08/2020 10:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

త్వరలోనే ‘మేక సూరి 2’ వస్తుంది!

హైదరాబాద్‌: ‘‘దర్శకుడనేవాడు ఏ తరహా కథనైనా మనస్ఫూర్తిగా సొంతం చేసుకోగలగాలి. ఏ తరహా జోనర్‌ చెయ్యడానికైనా సిద్ధంగా ఉండాలని నమ్ముతా. నా వల్ల ఇది కాదు అని ఎప్పుడూ అనుకోను’’ అంటున్నారు త్రినాథ్‌ వెలిసెల. ‘మేక సూరి’ అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన దర్శకుడీయన. అభినయ్‌, సుమయ జంటగా నటించారు. ఇటీవలే ‘జీ 5’ ఓటీటీలో విడుదలైంది. ఈ నేపథ్యంలో త్రినాథ్‌ చెప్పిన సంగతులివి.

‘‘మేక సూరి’ వెబ్‌సిరీస్‌ను కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించా. ఇందులో సూరి అనే కసాయి పాత్రలో నటించాడు అభినయ్‌. రాణి అనే పాత్ర పోషించింది సుమయ. మేక మాంసం విక్రయించడం సూరి వృత్తి. అందుకే అతన్ని అందరూ మేక సూరి అని పిలుస్తుంటారు. అతను ఆ ఊరిలో రాణి అనే ఓ అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారి జీవితాలు అంతా సాఫీగా సాగిపోతున్నాయన్న తరుణంలోనే రాణి హత్యకు గురవుతుంది. మరి ఆమెను ఎవరు చంపారు? ఆ చంపిన వాళ్లపై సూరి ఎలా పగ తీర్చుకున్నాడనేది చిత్ర కథాంశం. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. పార్థు సైనా ఛాయాగ్రహణం, ప్రజ్వల్‌ క్రిష్‌ నేపథ్య సంగీతం ఈ వెబ్‌సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దీన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాం. త్వరలోనే ‘మేక సూరి 2’ విడుదలవుతుంది. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది’’.

‘‘మాది విజయవాడ. పుట్టిపెరిగిందంతా అక్కడే. చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. అందుకే చదువు పూర్తవ్వగానే ఇండస్ట్రీలోకి వచ్చా. ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘ఒక్క క్షణం’ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశా. దర్శకుడిగా క్రిస్టోఫర్‌ నోలన్‌ స్ఫూర్తిగా తీసుకుంటా. తెలుగులో రాజమౌళి, వి.వి.వినాయక్‌, సుకుమార్‌లను అభిమానిస్తా. అన్ని రకాల జోనర్లు చెయ్యాలనుంది. రొమాంటిక్‌ కామెడీ, టైమ్‌ మిషన్‌ కథలు, సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రాలంటే చాలా ఇష్టం’’ అన్నారు.      
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని