close

తాజా వార్తలు

చిరు పక్కన ఈ ముద్దుగుమ్మే

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో కథానాయిక ఎవరనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో అనుష్క, కాజల్‌, నయనతార, త్రిష.. పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఎట్టకేలకు త్రిషను ఈ ప్రాజెక్టుకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఈ సినిమాలో మెగాస్టార్‌ పక్కన కనిపించనున్నారట. కథానాయిక ఎవరు? అనే విషయం గురించి ఇప్పటి  వరకు దర్శక, నిర్మాతలు స్పందించలేదు. కానీ త్రిష స్వయంగా ఈ వార్తని నిజం చేశారు. ఓ సినీ విశ్లేషకుడు ఈ ఏడాది త్రిష మూడు సినిమాలతో అలరించబోతున్నారని జాబితాను ట్వీట్‌ చేశారు. మణిరత్నంతో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’, మోహన్‌లాల్‌తో ఓ సినిమా, చిరంజీవి-కొరటాల శివ సినిమాలో ఆమె నటించబోతున్నారని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ చూసిన త్రిష స్పందించారు. నిజమే అంటూ విక్టరీ ఎమోజీతోపాటు #2020 ట్యాగ్‌ను జత చేశారు. దీంతో చిరు చిత్రంలో ఆమే అని నెటిజన్లు నిర్ధారించుకున్నారు. కానీ దర్శక, నిర్మాతలు మాత్రం కథానాయిక ఎవరు అనే విషయంపై ఎటువంటి ప్రకటన చేయలేదు.

కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇటీవల లాంఛనంగా పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు. చిరు-త్రిష ఇది వరకు ‘స్టాలిన్‌’లో నటించారు. త్రిష కూడా తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఓ మంచి సినిమాతో టాలీవుడ్‌లో తిరిగి అడుగుపెట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె చిరు సినిమాకు సంతకం చేసినట్లు తెలుస్తోంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.