మరిన్ని చైనా కాన్సులేట్‌లు మూసేస్తాం: ట్రంప్‌ - Trump hints to close more more Chinese Consulates
close
Published : 23/07/2020 16:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరిన్ని చైనా కాన్సులేట్‌లు మూసేస్తాం: ట్రంప్‌

సంకేతాలిచ్చిన అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్‌: ప్రపంచదేశాలను సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ మహమ్మారికి కారణం చైనానే  అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శిస్తూనే ఉన్నారు. దీనికి కారణమైన చైనాపై చర్యలు ఉంటాయని పలుమార్లు హెచ్చరించారు. తాజాగా అమెరికా ఆ వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే హ్యూస్టన్‌లోని చైనా రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలో మరిన్ని చైనా రాయబార కార్యాలయాలను మూసివేసే అవకాశం ఉందని, ఈ అంశాన్ని కొట్టిపారేయలేమని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. హ్యూస్టన్‌లో చైనా రాయబార కార్యాలయాన్ని మూసివేయాలన్న ఆదేశంపై ట్రంప్‌ స్పందించారు. హ్యూస్టన్‌లోని చైనా కార్యాలయంలో మంటలు చెలరేగాయని వెల్లడించారు. అక్కడ వారు పత్రాలు తగులబెట్టినట్లు భావిస్తున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే వారు అలా ఎందుకు చేశారో తెలియదని, ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయినట్లు ట్రంప్‌ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని చైనా రాయబార కార్యాలయాలు సైతం మూసివేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. శ్వేత సౌధం‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్‌ ఈ విషయాలు వెల్లడించారు.

గూఢచర్యం ఆరోపణలు..
అమెరికాలో తన రాయబార కార్యాలయం నుంచి చైనా అక్రమంగా గూఢచర్యానికి పాల్పడుతోందని అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా మేధో సంపత్తిని, అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవడంలో భాగంగానే చైనా కాన్సులేట్‌ మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా సమర్ధించుకుంటోంది. ఈ సందర్భంలోనే హ్యూస్టన్‌లోని కార్యాలయాన్ని 72గంటల్లోగా మూసివేయాలని ఆదేశించిన విషయాన్ని చైనా స్వయంగా వెల్లడించింది. ఇది ఇరుదేశాల దౌత్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరించింది. అమెరికా చర్యను తీవ్రంగా ఖండించిన చైనా.. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే సరైన రీతిలో స్పందిస్తామని స్పష్టం చేసింది.

చైనా ప్రతీకార చర్య..!
అమెరికా తీరును ఖండించిన చైనా ప్రతీకారచర్యకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగా చైనాలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని మూసివేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. తొలుత చెంగ్డూ నగరంలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని మూసివేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని చైనా స్థానిక మీడియా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా చైనాను దోషిగా చిత్రీకరించడానికే అమెరికా ప్రయత్నం చేస్తోందంటూ చైనా మీడియా అభిప్రాయపడింది. 
అమెరికాలో మొత్తం ఐదు నగరాల్లో చైనా రాయబార కార్యాలయాలు ఉన్నాయి. చైనాలోనూ అమెరికాకు చెందిన ఐదు రాయబార కార్యాలయాలు ఉన్నాయి. వీటికి అధనంగా హాంగ్‌కాంగ్‌లోనూ అమెరికా రాయబార కార్యాలయం ఉంది. 

ఇవీ చదవండి..
ఆ చైనా కాన్సులేట్‌ మూసేయండి..అమెరికా ఆదేశం
చైనాపై  చర్యలు తప్పవు..ట్రంప్‌


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని