వైరాలజిస్టు ఖాతాను తొలగించిన ట్విటర్‌ - Twitter Suspends Account of Chinese Virologist Who Claimed Covid-19 Was Man-Made in Wuhan Labratory
close
Updated : 17/09/2020 12:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైరాలజిస్టు ఖాతాను తొలగించిన ట్విటర్‌

వుహాన్‌లోని ఓ పాఠశాల

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ పుట్టుక నిజాలు చైనా దాస్తోందంటూ గొంతెత్తిన వైరాలజిస్టు ఖాతాను ట్విటర్‌ తొలగించింది. చైనాలోని వుహాన్‌కు చెందిన ఓ ల్యాబ్‌ నుంచే వైరస్‌ బయటికి వచ్చిందని అదే దేశానికి చెందిన వైరాలజిస్టు లీ మెంగ్‌ యాన్‌ ఆరోపించారు. వైరస్‌ చైనాలోనే పుట్టిందనడానికి తన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయన్నారు. వైరస్‌ గురించి తాను ముందే హెచ్చరించినప్పటికీ డబ్ల్యూహెచ్‌ఓ, చైనా ఉన్నతాధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. అధికారుల బెదిరింపుల వల్ల తాను అమెరికాకు పారిపోయానని ఆమె చెప్పుకొచ్చారు. ఈ మేరకు కొద్దిరోజుల క్రితం ఆమె ట్విటర్‌లో ఓ వీడియో సందేశాన్ని పోస్టు చేశారు. అయితే, తాజాగా ట్విటర్‌ ఆమె ఖాతాను తొలగించింది. నిబంధనలు ఉల్లఘించిన కారణంగా ఆమె ఖాతాను తొలగించినట్లు ట్విటర్‌ పేర్కొంది. తన ఖాతా తొలగింపుపై ఆ వైరాలజిస్టు  స్పందించారు. కరోనా వైరస్‌ పుట్టుకకు సంబంధించిన నిజాలు ప్రజలకు తెలియకూడదన్న ఉద్దేశంతోనే తన ఖాతాను తొలగించారని ఆమె ఓ టీవీ షోలో పేర్కొన్నారు.

కరోనా వైరస్‌పై పరిశోధన చేశానని యాన్‌ చెప్తుండగా.. 2019 డిసెంబర్‌ నుంచి 2020 జనవరి మధ్య కాలంలో తమ యూనివర్సిటీలో కరోనా వైరస్‌పై సదరు వైరాలజిస్టు ఎటువంటి పరిశోధనలు చేయలేదని హాంకాంగ్‌ యూనివర్సిటీ పేర్కొంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని