‘సలార్‌’లో ప్రభాస్‌కు జోడీగా ఇద్దరు భామలు.! - Two heroines will share screen with Prabhas in Salaar
close
Published : 25/12/2020 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సలార్‌’లో ప్రభాస్‌కు జోడీగా ఇద్దరు భామలు.!

ఇంటర్నెట్‌ డెస్క్‌: యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ మరోసారి ఇద్దరు హీరోయిన్లతో ఆడిపాడనున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ‘కేజీఎఫ్‌’ దర్శకుడు ప్రశాంత్‌నీల్‌, ‘బాహుబలి’ ప్రభాస్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. దానికి ‘సలార్‌’ అనే టైటిల్‌ ఖరారు చేయడంతో పాటు అందులో ప్రభాస్‌ ఇలా ఉండబోతున్నాడంటూ.. ఓ మాస్‌లుక్‌ను కూడా విడుదల చేసింది చిత్రబృందం. అయితే.. ఈ సినిమా గురించి కొన్ని వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన ఇద్దరు హీరోయిన్లు ఆడిపాడనున్నారట.

ఇప్పటికే ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్‌ భామ దిశా పటానిని చిత్రబృందం సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. దానిపై ఎలాంటి స్పష్టతా రాలేదు. ఇదిలా ఉండగానే.. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన ఇద్దరు హీరోయిన్లను తీసుకోవాలని కెప్టెన్ ప్రశాంత్‌ నీల్‌ అనుకుంటున్నారట. అయితే.. ఇంకో భామ ఎవరూ అనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు. ప్రభాస్‌ గతంలో ఇద్దరు హీరోయిన్లతో చేసిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి. పౌర్ణమి, బాహుబలి, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ సినిమాల్లో ప్రభాస్‌ ఇద్దరు హీరోయిన్లతో ఆడిపాడారు. మరి ‘సలార్‌’లో ఇద్దరు హీరోయిన్లంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత..? ఒకవేళ ఇద్దరు హీరోయిన్లను తీసుకుంటే.. ప్రభాస్‌ ఇద్దరు హీరోయిన్ల సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా..? వేచి చూడాల్సిందే మరి. కాగా.. ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి..

లిఫ్ట్‌లో ఇరుక్కున్న అనసూయమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని