ప్రపంచంలో మూడింట ఇద్దరికి కోవాక్స్‌ రక్షణ - Two thirds of worlds population joined COVAX Facility
close
Published : 22/09/2020 21:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రపంచంలో మూడింట ఇద్దరికి కోవాక్స్‌ రక్షణ

ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

జెనీవా: భారత్‌తో సహా 156 దేశాలు అంతర్జాతీయ కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ సహాయక కార్యక్రమం ‘కోవాక్స్‌ ఫెసిలిటీ’ పరిధిలోకి వచ్చినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యుహెచ్‌ఓ) ప్రకటించింది. ఇది కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను సభ్య దేశాల ప్రజలకు సక్రమంగా, నిష్పక్షపాతంగా పంపిణీ చేసే కార్యక్రమం అని సంస్థ వివరించింది. దీనితో ప్రపంచ జనాభాలో రెండింట మూడు వంతుల మందికి కోవ్యాక్సిన్ రక్షణ లభించినట్లయిందని డబ్యుహెచ్‌ఓ తెలిపింది.

64 శాతం ప్రపంచ ప్రజలకు రక్షణ

2021కల్లా కొవిడ్‌ కల్లోలం తీవ్రస్థాయికి చేరనున్న నేపథ్యంలో.. అప్పటికి 1 బిలియన్‌ ప్రజలకు సరిపోయే 2 బిలియన్‌ డోసుల వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవటమే ధ్యేయంగా కృషిచేస్తున్నామని డబ్యుహెచ్‌ఓ వివరించింది. ఇందుకుగాను కొవిడ్‌ వ్యాక్సిన్‌ను సేకరించి, అందుబాటులోకి తెచ్చే ప్రపంచవ్యాప్త యంత్రాంగం ‘గావి’, కొలిషన్‌ ఫర్‌ ఎపిడెమిక్‌ ప్రిపేర్‌డ్‌నెస్‌ ఇన్నోవేషన్స్‌ (సెపీ), యునిసెఫ్‌, ప్రపంచ బ్యాంకు, సామాజిక సేవా సంస్థలు, వ్యాక్సిన్‌ తయారీదారులు సహా పలువురు తమతో కలసి పనిచేస్తున్నారని తెలిపింది. దీనితో ప్రపంచ జనాభాలో 64 శాతం కొవాక్స్‌ రక్షణ పరిధిలోకి వచ్చారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

ప్రతి దేశానికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌

కోవాక్స్‌ ఫెసిలిటీ ద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన వ్యాధినిరోధక నిపుణుల వ్యూహాత్మక సలహా బృందం మార్గదర్శకత్వంలో వ్యాక్సిన్‌ పంపిణీ జరుగుతుందని.. ప్రతి భాగస్వామ్య దేశానికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుతుందని సంస్థ వివరించింది. దీని సాధనకు 2020 చివరికల్లా 2 బిలియన్‌ డాలర్ల మూలధనం అవసరం కాగా, ప్రస్తుతం 1.4 బిలియన్‌ డాలర్లు వివిధ ప్రభుత్వాలు, వ్యాక్సిన్‌ తయారీదార్లు, వివిధ సంస్థలు వ్యక్తుల ద్వారా సమకూరిందని తెలిపింది. సంపన్న దేశాలు తొలుత వారి ఆర్థిక సహాయాన్ని అందచేస్తాయని వివరించింది.

కోవాక్స్‌ భాగస్వామ్య దేశాల్లో 64 వ్యాక్సిన్‌ను స్వయంగా కొనుగోలు చేయగలిగే సామర్థ్యం గల సంపన్న దేశాలు.. 92 అల్ప, మధ్యస్థ ఆదాయం గల దేశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కాగా మరో 38 దేశాలు చేరే అవకాశం ఉందని కూడా తెలిపింది. కనీసం మూడు సురక్షితమైన, ప్రభావవంతమైన వ్యాక్సిన్‌లను తయారు చేయటమే తమ లక్ష్యమని.. ఇందుకుగాను వ్యాక్సిన్‌ తయారీదారులు, ఉత్పత్తిదారులతో కోవాక్స్‌ ఫెసిలిటీ ఒప్పందాలు చేసుకుంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని