సోనూ సూద్‌కు ఐక్యరాజ్య సమితి అవార్డు - UNDP announces award for Sonu Sood
close
Published : 29/09/2020 16:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోనూ సూద్‌కు ఐక్యరాజ్య సమితి అవార్డు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు సోనూసూద్‌కు ఐక్యరాజ్య సమితి అవార్డు వరించింది. ఐరాస అనుబంధ సంస్థ యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ఆయనకు ‘ఎస్‌డీజీ స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ అవార్డు’ను  ప్రకటించింది. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కాలంలో లక్షలాది వలస కార్మికులు, విద్యార్థులకు సేవలందించినందుకు ఆయన ఈ గౌరవానికి ఎన్నికయ్యారు.  ఈ అవార్డును ఆయనకు ఓ వర్చువల్‌ కార్యక్రమంలో సోమవారం సాయంత్రం ప్రదానం చేశారు. తద్వారా ఐరాస అవార్డును అందుకున్న యాంజెలినా జోలీ, డేవిడ్‌ బెక్‌హామ్‌, లియోనార్డో డి కాప్రియో, ప్రియాంకా చోప్రా తదితర సినీ ప్రముఖుల జాబితాలో సోనూ చేరారు.

ఈ సందర్భంగా సోనూ సూద్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది ఓ అరుదైన గౌరవం. ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందటం చాలా ప్రత్యేకం. నా దేశ ప్రజలకు నేను చేయగలిగిన కొద్దిపాటి సహాయాన్ని, నాకు వీలయిన విధంగా, ఏ ప్రయోజనం ఆశించకుండా చేశాను. అయితే నా చర్యలను గుర్తించి, అవార్డు అందించటం చాలా ఆనందంగా ఉంది. యూఎన్‌డీపీ తన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీ) చేరుకునేందుకు నా పూర్తి సహకారం ఉంటుంది. సంస్థ చర్యల వల్ల మానవాళికి, పర్యావరణానికి అమితమైన మేలు చేకూరుతుంది’’ అని ప్రకటించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని