close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120024882 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => Xr5gf6px4vE [video_short_link] => Xr5gf6px4vE [created_by] => [created_date] => [modified_by] => 9821947 [modified_date] => 2020-02-21 11:36:20.644484 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

‘బాహుబలి’ నిర్మాతల న్యూమూవీ టీజర్‌

వెంకటేశ్‌ మహా డైరెక్షన్‌లో..

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రాన్ని నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..’. మలయాళంలో విజయవంతమైన ‘మహేశింతే ప్రతీకారమ్‌’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. శోభూ యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘కేరాఫ్‌ కంచరపాలెం’ లాంటి విభిన్న కథా చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమైన వెంకటేశ్‌ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నరేశ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. 

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..’ సినిమా టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. విభిన్న కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌లోని సన్నివేశాలు ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉన్నాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సత్యదేవ్‌ ఫొటోగ్రాఫర్‌గా కనిపించనున్నారు. టీజర్‌లోని మాటలు, బ్యాంక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ను చూస్తుంటే ‘కేరాఫ్‌ కంచరపాలెం’ గుర్తుకువచ్చేలా ఉంది.

 

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.