ఆత్మాహుతి దాడిలో అంపైర్‌ మృతి - Umpire From Afghanistan Killed in car Blast
close
Updated : 05/10/2020 06:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆత్మాహుతి దాడిలో అంపైర్‌ మృతి

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో అంతర్జాతీయ క్రికెట్‌ అంపైర్‌ బిస్మిల్లా జాన్‌ షిన్వారి మృతిచెందారు. అఫ్గాన్‌కు చెందిన షిన్వారి పలు అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించారు. స్థానిక మీడియా వివరాల ప్రకారం.. నంగర్‌హార్‌ ప్రావిన్స్‌లోని ఘనిఖిల్‌ జిల్లా గవర్నర్‌ ఇంటివద్ద శనివారం మధ్యాహ్నం దుండగులు కారు బాంబు ద్వారా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 15 మంది మృతిచెందగా మరో 30 మంది గాయాలపాలయ్యారు. మరణించిన వారిలో అంపైర్‌ షిన్వారి కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. నంగర్‌హార్ గవర్నర్ కార్యాలయ ప్రతినిధి ఆ ఘటనను ధ్రువీకరించారు. తుపాకులతో కొందరు దుండుగులు జిల్లా గవర్నర్‌ కాంపౌండ్‌లోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా వారిని సెక్యూరిటీ సిబ్బంది కాల్చి చంపారని వెల్లడించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని