నిరుద్యోగిత, అంటువ్యాధులే ప్రధాన సవాళ్లు - Unemployment and epidemics are the main challenges
close
Updated : 09/10/2020 04:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిరుద్యోగిత, అంటువ్యాధులే ప్రధాన సవాళ్లు

డబ్ల్యూఈఎఫ్‌ సర్వే

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వ్యాపార అధిపతులను కలవరానికి గురి చేసే సమస్యల్లో నిరుద్యోగ సమస్య ప్రధానమైనదని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) సర్వే వెల్లడించింది. ఆ తర్వాత ఎక్కువగా భయపెడుతున్నవి ‘అంటువ్యాధులే’నని తెలిపింది. 2019లో అతి పెద్ద ముప్పుగా నిలిచిన ‘నిధుల సంక్షోభం’ ఈసారి మూడో స్థానానికి పరిమితమైంది. వ్యాపార నిర్వహణకు ఆయా ప్రాంతాలవారీగా ఎదురవుతున్న ప్రధాన ముప్పులేమిటి అనే అంశంపై డబ్ల్యూఈఎఫ్‌ ఈ సర్వేను నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం.. దక్షిణాసియాలోని అన్ని ప్రాంతాల్లో తొలి 10 ప్రధాన ముప్పుల్లో అంటువ్యాధులకు చోటు దక్కింది. కొవిడ్‌-19 మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యంపై ఆందోళనలు నెలకొనడం ఇందుకు కారణమైంది. ఉగ్రవాది దాడులు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ సంక్షోభాలు సహా మొత్తం 30 ముప్పులను సర్వే గుర్తించింది. తూర్పు ఆసియా, పసిఫిక్‌, ఐరోపా, లాటిన్‌ అమెరికా, కరేబియన్‌, మధ్య ప్రాచ్య, ఉత్తర ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణాసియా, దక్షిణ ఆఫ్రికా దేశాల్లో ఈ సర్వేను డబ్ల్యూఈఎఫ్‌ నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా 127 దేశాల్లో 12,000 మందికి పైగా వ్యాపార అధిపతులు ఇందులో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడిచారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని