కోలుకున్న షా.. త్వరలో డిశ్చార్జి - Union Miinister Amit Shah has recovered AIIMS
close
Published : 29/08/2020 17:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోలుకున్న షా.. త్వరలో డిశ్చార్జి

దిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కోలుకున్నారని, త్వరలో ఆయనను డిశ్చార్జ్‌ చేస్తామని దిల్లీ ఎయిమ్స్‌ వర్గాలు వెల్లడించాయి. కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఆస్పత్రిలో చేరిన ఆయన పరిస్థితి ప్రస్తుతం మెరుగుపడిందని ఎయిమ్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 2న కొవిడ్‌తో అమిత్‌షా గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. అనంతరం నిర్వహించిన కొవిడ్‌-19 పరీక్షల్లో నెగటివ్‌ అని తేలడంతో డిశ్చార్జి అయ్యారు. ఆయన కోలుకున్న కొన్ని రోజులకే అలసట, ఒళ్లు నొప్పులతో ఆగస్టు 18న ఎయిమ్స్‌లో చేరారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని