అత్యవసరమైతే తప్ప బయటకు వద్దు:కిషన్‌రెడ్డి - Union Minister Kishan Reddy on Heavy Rain
close
Updated : 14/10/2020 02:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అత్యవసరమైతే తప్ప బయటకు వద్దు:కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: రానున్న రెండు రోజుల్లో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. ఈ సమయంలో లోతట్టు, వరద ముప్పు ఉన్న ప్రాంతాల పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం ఉంటే తప్ప ఎవరూ బయటకు వెళ్లవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.. ఇలాంటి క్లిష్ట సమయాల్లో అధికారులు, సిబ్బందితో కలిసి సహాయ చర్యల్లో పాల్గొనటానికి స్వచ్ఛంద సేవకులు, వాలంటీర్లు, పౌరులు ముందుకు రావాలని కోరారు. 
తాను కూడా వ్యక్తిగతంగా ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీతో మాట్లాడి సహాయ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించినట్లు చెప్పారు. 
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ అంతటా సహాయ కార్యక్రమాల కోసం మరో రెండు బృందాలు ఈ రాత్రికి విజయవాడ నుండి హైదరాబాద్ చేరుకోనున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇంటిలోనే ఉండి ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే అధికారులను సంప్రదించాలని కిషన్‌రెడ్డి సూచించారు. అవసరమైతే స్థానిక దళాలకు సహాయం చేయడానికి సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్పీఎఫ్‌ తదితర పారామిలిటరీ దళాలను తీసుకు రావడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని