పాపడ్‌తో కరోనాకి అడ్డుకట్ట అన్న మంత్రికి కరోనా - Union Minister Who Claimed Papad Helps Fight COVID 19 Tests Positive
close
Published : 09/08/2020 17:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాపడ్‌తో కరోనాకి అడ్డుకట్ట అన్న మంత్రికి కరోనా

దిల్లీ: కేంద్రమంత్రి ఆర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ తనకు కరోనా సోకినట్లు వెల్లడించారు. ప్రస్తుతం దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నట్లు భారీ పరిశ్రమలు, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి మేఘ్‌వాల్‌ తెలిపారు. కొవిడ్‌ లక్షణాలు బయటపడటంతో రెండు సార్లు పరీక్షలు చేయించుకున్నట్లు, రెండో సారి జరిపిన పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ‘లక్షణాలు కనిపించిన తర్వాత కరోనా పరీక్షలు నిర్వహించుకున్నాను. రెండోసారి జరిపిన టెస్టుల్లో పాజిటివ్‌గా తేలింది. వైద్యుల సలహా మేరకు దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నాను. నాతో కాంటాక్ట్‌లో ఉన్నవారు వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి’ అని పేర్కొన్నారు. 

జులై చివరి వారంతో భాజపా మంత్రి అర్జున్‌ రామ్‌ మేఫ్‌వాల్‌కు చెందిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. పాపడ్‌లో యాంటీ బాడీలు ఉంటాయని, అవి కరోనాను నివారిస్తాయని ఆ వీడియోలో పేర్కొన్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని