కేంద్రమంత్రి కైలాష్‌ చౌదరికి కరోనా - Union Minister of State for Agriculture Kailash Choudhary has tested positive for coronavirus he said in a tweet today
close
Published : 08/08/2020 23:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేంద్రమంత్రి కైలాష్‌ చౌదరికి కరోనా

జైపుర్‌: కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి కైలాష్‌ చౌదరి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన శనివారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం రాజస్థాన్‌ రాష్ట్రం జోద్‌పుర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ‘పలు కరోనా లక్షణాలు కనిపించడంతో గత రాత్రి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించుకున్నాను. రిపోర్టులు పాజిటివ్‌గా తేల్చాయి. గత కొద్దిరోజులుగా నాతో క్లోజ్‌ కాంటాక్ట్‌లో ఉన్నవారంతా కుటుంబసభ్యులకు దూరంగా ఉండండి. పరీక్షలు నిర్వహించుకోండి’ అని ట్వీట్‌ చేశారు. జ్వరంతోపాటు కొద్దిగా శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నట్లు తెలిపారు. ఆసుపత్రిలోని వైద్యులు అవసరమైన అన్ని రకాల చికిత్సలు అందిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని