‘ఉప్పెన’ విడుదల మరింత ఆలస్యం కానుందా? - Uppena Release Pushed Further
close
Published : 13/12/2020 15:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఉప్పెన’ విడుదల మరింత ఆలస్యం కానుందా?

ఇంటర్నెట్‌ డెస్క్: వైష్ణవ్‌తేజ్‌ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉప్పెన’. కృతిశెట్టి కథానాయిక. మైత్రీ మూవీ మేకర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది వేసవికి ముందే విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా వాయిదా పడింది. కరోనా పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతుండటంతో థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం నుంచి ఇటీవలే అనుమతి లభించింది. దీంతో సంక్రాంతి బరిలో ‘ఉప్పెన’ ఉండొచ్చని అంతా భావించారు. కానీ, చిత్ర బృందం ఆలోచన మరోలా ఉంది.

వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూర్చిన ఇందులోని పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్‌ దక్కించుకుని అమిత ప్రేక్షాదరణ పొందాయి. దీంతో అనేక ఓటీటీ మాధ్యమ సంస్థలు ఈ చిత్ర విడుదల హక్కులు పొందేందుకు భారీగానే ఆఫర్‌ చేశాయి. కానీ మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌ మొదటి సినిమా కావడంతో థియేటర్‌ సందడి మిస్‌ కాకూడదని ఇంతకాలం వేచి చూశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని