వైష్ణవ్‌ తేజ్.. తెలియని తన్మయత్వం - Uppena new look
close
Published : 03/09/2020 11:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైష్ణవ్‌ తేజ్.. తెలియని తన్మయత్వం

హైదరాబాద్‌: వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉప్పెన’. తమిళ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా  ఈ సినిమాలోని కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.

ఇందులో కథానాయకుడు వైష్ణవ్‌ తేజ్‌ పూలచొక్కా గల్లాను నోటితో పట్టుకుని తెలియని తన్మయత్వంతో ఆనందంగా కనిపిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్‌ ఈ చిత్రానికి అందించిన బాణీలు ఇప్పటికే శ్రోతల మనసు దోచేయడం విశేషం. పరిస్థితులు చక్కబడి థియేటర్లు తెరుచుకోగానే ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.  ఇప్పటికే విడుదలైన రెండు లిరికల్‌ సాంగ్స్‌కు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని