ఏపీలో మరోసారి పన్ను బాదుడు - VAT Tax hike in AP
close
Published : 12/09/2020 14:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో మరోసారి పన్ను బాదుడు

అమరావతి: రాష్ట్రంలో సహజ వాయువుపై వ్యాట్‌ చట్టం ప్రకారం పన్ను పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. 14.5 శాతం నుంచి 24.5శాతానికి విలువ ఆధారిత పన్నును పెంచుతూ వాణిజ్య పన్నులశాఖ శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పటికే ఐదు రకాల పెట్రోలియం ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం విలువ ఆధారిత పన్ను వసూలు చేస్తోంది. 

ముడిచమురుపై 5శాతం మేర, పెట్రోల్‌పై 31శాతంతో పాటు అదనంగా నాలుగు రూపాయల మేర పన్ను వసూలు చేస్తోంది. డీజిల్‌పై 22.5శాతంతో పాటు అదనంగా నాలుగు రూపాయల మేర, ఎయిర్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌పై ఒకశాతం మేర వాణిజ్య పన్నుల శాఖ వ్యాట్‌ వసూలు చేస్తోంది. కొవిడ్‌ కారణంగా పన్నులపై  గత ఐదు నెలలుగా ఆదాయం కోల్పోయినందున సహజవాయువుపై అదనంగా 10 శాతం మేర వ్యాట్‌  పెంచుతున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2020 ఏప్రిల్‌ నాటికి రూ.4,480 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉండగా..కేవలం రూ.1323 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. పలు ప్రభుత్వ పథకాలకు నిధులు కావాల్సి ఉన్నందున సహజవాయువుపైనా పన్ను పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని