కరోనాను ఆపడానికి వ్యాక్సిన్‌ ఒక్కటే చాలదు! - Vaccine Will Not Be Enough To Stop COVID 19 says WHO Chief
close
Published : 17/11/2020 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాను ఆపడానికి వ్యాక్సిన్‌ ఒక్కటే చాలదు!

డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ వ్యాఖ్య

జెనీవా: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ను వ్యాక్సిన్‌ ఒక్కటే అడ్డుకోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గేబ్రియోసిస్‌ వ్యాఖ్యానించారు. కరోనాపై పోరాటానికి మన వద్ద ఉన్న ఇతర సాధనాలకు ఇది సంపూర్ణతను మాత్రమే ఇస్తుంది తప్ప వాటిని భర్తీ చేయలేదన్నారు. సోమవారం టెడ్రోస్‌ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీపై ప్రారంభంలో పరిమితులు ఉంటాయని, ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులు, వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్నవారికి తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇలా చేయడం వల్ల కరోనా మరణాలు తగ్గించగలుగుతామన్నారు. ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. అందుకోసం ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలను మున్ముందు కొనసాగించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ వైరస్‌పై నిఘాను కొనసాగించాలని, ప్రజలు పరీక్షలు చేయించుకోవాలన్నారు. వైరస్‌ సోకినవారిని ఐసోలేట్‌ చేసి వారిపట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా సోకిన వ్యక్తులను కలిసిన వారిని గుర్తించడం, చికిత్స అందించడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. 
మరోవైపు, శనివారం ఒక్కరోజే ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా 6,60,905 కొత్త కేసులు వచ్చినట్టు యూఎన్‌ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇప్పటికే ఈ మహమ్మారి 54 మిలియన్ల మందిని సోకగా.. దీంతో 1.3మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని