
తాజా వార్తలు
ఫాలోవర్స్ అందరూ అప్రమత్తంగా ఉండండి..!
ప్రకటన విడుదల చేసిన నటి వరలక్ష్మి
చెన్నై: సామాజిక మాధ్యమాల వేదికగా తనని ఫాలో అవుతున్న వారందరూ కొన్నిరోజులపాటు అప్రమత్తంగా ఉండాలని నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కోరారు. ‘పోడా పోడీ’ చిత్రంతో కథానాయికగా తెరంగేట్రం చేసిన ఆమె తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఆమె సోషల్‌మీడియా వేదికగా తరచూ అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. అయితే, తాజాగా వరలక్ష్మి ఇన్‌స్టా, ట్విటర్ ఖాతాలు హ్యాక్‌కు గురయ్యాయి. వాటిని పునరుద్ధరించడానికి కొన్ని రోజులు సమయం పడుతుందని తెలియజేస్తూ ఆమె ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది.
‘గత రాత్రి నా సోషల్‌మీడియా(ట్విటర్, ఇన్‌స్టా) ఖాతాలు హ్యాక్‌కు గురయ్యాయి. వీలైనంత త్వరగా వాటిని పునరుద్ధరించడానికి నా టీమ్ కృషి చేస్తుంది. కాకపోతే, కొన్ని కారణాల వల్ల మరికొన్ని రోజులు సమయం పట్టేలా ఉంది. రానున్న కొన్నిరోజులపాటు ట్విటర్, ఇన్‌స్టా వేదికలుగా నా పేరుతో ఏమైనా మెస్సేజ్‌లు వస్తే ఫాలోవర్స్ అందరూ వాటిపట్ల అప్రమత్తంగా ఉండండి. ట్విటర్, ఇన్‌స్టా ఖాతాలు ఒక్కసారి అందుబాటులోకి రాగానే నేనే మీ అందరికీ సమాచారం అందిస్తాను. త్వరలోనే మీ అందర్నీ సోషల్‌మీడియా వేదికగా కలుస్తాను’ అని వరలక్ష్మి తెలియజేశారు.
గతేడాది విడుదలైన ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’తో వరలక్ష్మి తెలుగు తెరకు పరిచయమయ్యారు. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో ఆమె ప్రతినాయకురాలి లక్షణాలున్న పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆమె ‘నాంది’, ‘క్రాక్’ చిత్రాల్లో నటిస్తున్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- మరో 6 పరుగులు చేసుంటే..
- నేను తెలుగింటి అల్లుడినే: సోనూసూద్
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- డ్రాగన్ ‘ప్లాన్’ ప్రకారమే..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
