అమ్మాయిల పోరు: బౌలింగ్ ఎంచుకున్న మిథాలీ - Velocity opt to bowl
close
Updated : 04/11/2020 19:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మాయిల పోరు: బౌలింగ్ ఎంచుకున్న మిథాలీ

ఇంటర్నెట్‌డెస్క్‌: అమ్మాయిల ధనాధన్‌కు రంగం సిద్ధమైంది. షార్జా వేదికగా లీగ్‌ మూడో సీజన్‌ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని సూపర్‌నోవాస్‌, మిథాలీరాజ్‌ నాయకత్వంలోని వెలాసిటీ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన మిథాలీ బౌలింగ్‌‌ ఎంచుకుంది. గత రెండు సీజన్లలో సూపర్‌నోవాస్‌ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. లీగ్‌లో మూడో జట్టు ట్రయల్‌ బ్లేజర్స్‌. ఆ జట్టుకు స్మృతి మంధాన కెప్టెన్‌. కాగా, ఈ సీజన్‌లో ఒక్కో జట్టు మిగతా రెండు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. 3 మ్యాచ్‌ల అనంతరం తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఈనెల 9న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.

జట్ల వివరాలు:

సూపర్‌నోవాస్: ప్రియ, ఛామరి, జెమిమా, హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), శశికల, తానియా, పూజ, రాధ, పూనమ్‌, షకీరా, అయబొంగా

వెలాసిటీ: షెఫాలీ, డేనియల్, మిథాలీ (కెప్టెన్), వేదా, సుష్మ, సునె లూస్‌, మనాలీ, శిఖా, ఎక్తా, లీ కాస్పెరెక్‌, జహానారామరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని