close
Published : 28/09/2020 12:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌

హైదరాబాద్‌: యువ హీరో విజయ్‌ దేవరకొండ తన అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశారు. తన సినిమాకి సంబంధించిన సరికొత్త అప్‌డేట్‌ను నెట్టింట్లో పోస్ట్‌ చేశారు. ఈ మేరకు త్వరలోనే తాను సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ‘సుకుమార్‌- విజయ్‌ దేవరకొండ.. నాలోని నటుడు ఎంతో ఆనందిస్తున్నాడు. అలాగే నాలోని ప్రేక్షకుడు ఈ కాంబినేషన్‌ను సెలబ్రేట్‌ చేసుకుంటున్నాడు. ఇది ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయే చిత్రమవుతుందని మేము మాట ఇస్తున్నాం. సుకుమార్‌ సర్‌ సెట్‌లోకి అడుగుపెట్టాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను’ అని విజయ్‌ ప్రకటించారు. వచ్చే ఏడాదిలో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ఫాల్కన్‌ క్రియేషన్స్‌ పతాకంపై కేదార్‌ సెలగంశెట్టి నిర్మిస్తున్నారు.

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఫైటర్‌’ చిత్రంలో ప్రస్తుతం విజయ్‌ నటిస్తున్నారు. అనన్య పాండే కథానాయికగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఫైటర్‌ అనే పేరు ప్రచారంలో ఉంది. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో ఈ సినిమా రానుంది. మరోవైపు అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాకి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక కథానాయిక. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని