కష్టపడు.. అవసరం వస్తే కాల్‌ చెయ్‌: విజయ్‌ - Vijay Devarakonda tweet about Middle class Melodies
close
Published : 22/11/2020 21:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కష్టపడు.. అవసరం వస్తే కాల్‌ చెయ్‌: విజయ్‌

తమ్ముడి సినిమాపై అన్న ప్రశంసలు

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా వచ్చిన చిత్రం ‘మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌’. వినోద్‌ అనంతోజు డైరెక్టర్‌. వర్ష బొల్లమ్మ కథానాయిక. ఈ నెల 20న ఓటీటీలో విడుదలైన ఈ సినిమా అభిమానులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాపై విజయ్‌ దేవరకొండ ట్విటర్‌లో ‘మై థాట్స్‌ అబౌట్‌ మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’ పేరుతో లేఖ రాసి స్పందించాడు. అందులో చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించాడు.
‘యంగ్‌ డైరెక్టర్‌ వినోద్‌ అనంతోజు మంచి కథ అందించడంతో పాటు సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. నీ వెనకాల ఎప్పటికీ నేను ఉంటాను’ అని విజయ్‌ పేర్కొన్నాడు. ఇక సోదరుడు ఆనంద్‌ దేవరకొండ గురించి ప్రస్తావిస్తూ.. ‘నీ సోదరుడిగా నన్ను గర్వపడేలా చేశావ్. కథల ఎంపికలో నీకంటూ ప్రత్యేకత చాటుకున్నావ్. నువ్వు ఇలాగే కొత్త కథలు, కొత్త దర్శకులు, కొత్త నటులతో ముందుకు దూసుకుపోవాలని ఆశిస్తున్నా’ అని తమ్ముడిని పొగడ్తలతో ముంచెత్తాడు. ‘ఈ సినిమాలో హీరోయిన్‌గా వర్ష బొల్లమ్మ నటన అద్భుతం. అంతేకాదు.. సినిమాలో ప్రతి ఒక్కరూ తమతమ బాధ్యతలు చక్కగా పోషించారు. అందరూ ప్రశంసలకు అర్హులు’ అని అభిప్రాయపడ్డాడు. ‘‘సినిమా క్లైమాక్స్‌లో హీరో తండ్రి చెప్పిన డైలాగ్‌.. ‘కష్టపడు.. ఏదైనా అవసరం వస్తే కాల్‌ చెయ్‌’ అని మాత్రమే చెప్పగలను’ అంటూ తన లేఖను విజయ్‌ ముగించాడు.
విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమా ‘ఫైటర్‌’లో నటిస్తున్నాడు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనన్యపాండే హీరోయిన్‌. ఛార్మి, కరణ్‌ జోహార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దాదాపు షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లైమాక్స్‌ సన్నివేశం ఒక్కటే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు, హిందీలతో పాటు దేశంలోని పలు ప్రధాన భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని