ఓటీటీ కాదు.. థియేటర్లలోనే ‘లాభం’ - Vijay Sethupathi clarifies on Laabam release
close
Updated : 09/12/2020 22:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటీటీ కాదు.. థియేటర్లలోనే ‘లాభం’

చెన్నై: తన తర్వాతి సినిమా విడుదలపై తమిళ కథానాయకుడు విజయ్‌సేతుపతి అభిమానులకు స్పష్టతనిచ్చాడు. ఎస్పీ జననాథన్‌ దర్శకత్వంలో వస్తున్న ‘లాభం’ సినిమాలో విజయ్‌ ప్రధానపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకొని ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇది థియేటర్లలో విడుదలవుతుందా లేక ఓటీటీలోనా..? అని కోలీవుడ్‌లో బాగానే చర్చ సాగింది. అందుకు బేరసారాలు జరిగినట్లు జోరుగా వార్తలు కూడా వచ్చాయి. అయితే.. హీరో విజయ్‌ ఈ చర్చకు తెరదించాడు. సినిమాను ఓటీటీలో విడుదల చెయ్యబోమని.. థియేటర్లోనే ప్రేక్షకుల ముందుకు వస్తామని ప్రకటించాడు. ఈ విషయాన్ని నేరుగా సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.

కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్‌ వాయిదా పడటంతో పాటు విడుదల తేదీని కూడా మార్చుకోవాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ ముగియడంతో సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. థియేటర్లలోనే విడుదల చేస్తామని విజయ్‌ తీపి కబురు చెప్పడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా.. చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ చిత్రంలో విజయ్‌ సరసన శ్రుతిహాసన్‌ కనిపించనుంది. జాతీయ అవార్డు విజేత డైరెక్టర్‌ జననాథన్‌తో కలిసి విజయ్‌ చేస్తున్న రెండో సినిమా ఇది. మరోవైపు దాదాపు మూడు సంవత్సరాల విరామం తర్వాత శ్రుతిహాసన్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణ ఇటీవల ధర్మపురి, కృష్ణగిరి పరిసర ప్రాంతాల్లో జరిగిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి..

సెట్‌ నుంచి వెళ్లిపోయిన శ్రుతిహాసన్‌..!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని