కమల్‌ సినిమా.. టైటిల్‌ టీజర్‌ అదిరింది! - Vikram film official title teaser released
close
Published : 07/11/2020 17:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కమల్‌ సినిమా.. టైటిల్‌ టీజర్‌ అదిరింది!

చెన్నై: విలక్షణ నటుడు కమల్ హాసన్‌ తన పుట్టినరోజున అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేశారు. ఆయన 232వ సినిమా టైటిల్‌ టీజర్‌ను విడుదల చేశారు. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్‌ బాణీలు సమకూరుస్తున్నారు. శనివారం సాయంత్రం విడుదల చేసిన ఈ సినిమా ప్రచార చిత్రం వీక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రానికి ‘విక్రమ్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. కమల్‌ మాస్‌ క్యారెక్టర్‌లో అదరగొట్టారు. స్వయంగా భోజనం వండిన ఆయన అరటి ఆకుల్లో అతిథులకు వడ్డించారు. వాళ్లపై దాడి చేయడానికి ముందుగానే ఆయుధాల్ని ఇంట్లోని వివిధ ప్రదేశాల్లో దాచి పెట్టారు. ఇలా టైటిల్‌ టీజర్‌ ఆసక్తికరంగా సాగింది.

‘విశ్వరూపం 2’ తర్వాత కమల్‌ ‘భారతీయుడు 2’కు సంతకం చేశారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ కొన్నాళ్లు జరిగింది. లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణను ఆపారు. కాజల్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవంబరు చివర్లో తిరిగి షూటింగ్‌ ఆరంభించనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని