నాన్న కన్నుమూసినప్పుడే నిర్ణయించుకున్నా  - Virat Kohli says that he decided to take Cricket as career seriously only when his father expired
close
Published : 18/12/2020 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాన్న కన్నుమూసినప్పుడే నిర్ణయించుకున్నా 

ఏదేమైనా దానికే కట్టుబడి ఉన్నా: కోహ్లీ

ఇంటర్నెట్‌డెస్క్‌: తన తండ్రి ప్రేమ్‌కోహ్లీ కన్నుమూసినప్పుడే క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకున్నానని, అప్పుడే దీన్ని కెరీర్‌గా ఎంచుకున్నానని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. తొలిసారి క్రికెట్‌ ఆడింది తన తండ్రి తోనేనని, ఆయన బంతులేస్తే ప్లాస్టిక్‌ బ్యాట్‌తో ఆడానని చెప్పాడు. తాజాగా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌తో మాట్లాడిన సందర్భంగా కోహ్లీ తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంది అప్పుడేనని, అత్యున్నత స్థాయిలో ఆడాలనే కోరిక తనకు ఎప్పుడూ ఉండేదని అన్నాడు. తన ధ్యాసంతా ఆటమీదే మలిచానని, ఎలాగైనా టీమ్‌ఇండియాకు ఆడాలనుకున్నానని విరాట్‌ చెప్పుకొచ్చాడు.

ఇక ఆస్ట్రేలియాతో తొలి టెస్టు పూర్తయ్యాక తాను భారత్‌కు తిరిగి వచ్చే విషయంపై చాలా స్పష్టమైన ఆలోచనతో ఉన్నట్లు చెప్పాడు. జనవరిలో తన భార్య అనుష్క శర్మ తొలిసారి బిడ్డకు జన్మనివ్వబోతున్న సందర్భంగా ఆమె వద్దే ఉండాలనుకున్నానని, ఎట్టి పరిస్థితుల్లో ఆ మధుర క్షణాలను కోల్పోకూడదనే భావిస్తున్నట్లు తెలిపాడు. దేశం తరఫున ఆడడానికి ఎంత నిబద్ధతతో ఉంటామో.. ఇది కూడా అలాంటిదేనని  అన్నాడు. జీవితంలో ఇదో ప్రత్యేకమైన సందర్భమని, ఏదైమైనా ఆ సమయానికి తాను అనుష్కతో ఉండాలనుకున్నట్లు స్పష్టం చేశాడు. తమ తొలి బిడ్డ కోసం ఆసక్తిగా ఉన్నామన్నాడు. అనంతరం అజింక్య రహానె కెప్టెన్సీపై స్పందించిన అతడు.. ఆ విషయంపైనా ఆసక్తిగా ఉన్నానని చెప్పాడు. తాను భారత్‌కు తిరిగి వచ్చాక రహానె జట్టు పగ్గాలు చేపడతాడని, అతడికి నాయకత్వం చేయాలంటే ఇష్టమని వివరించాడు. అతడికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడనే నమ్మకం ఉందని కోహ్లీ తెలిపాడు. 

ఇవీ చదవండి..
ఆటకు ముందు వాళ్లిద్దరు..
కోహ్లీ ‘అర్థరహితం’ × పైన్‌ ‘వెనకడుగు వేయం’మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని