17-18 ఏళ్లలో ఇలా తొలిసారి: సెహ్వాగ్‌ - Virender Sehwag congratulates Delhi Capitals on reaching its first ever IPL Final
close
Published : 09/11/2020 12:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

17-18 ఏళ్లలో ఇలా తొలిసారి: సెహ్వాగ్‌

దిల్లీ ఫైనల్స్‌ చేరడంపై సల్మాన్‌ఖాన్‌ మీమ్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: బీసీసీఐ ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే టీ20 లీగ్‌లో దిల్లీ తొలిసారి ఫైనల్స్‌ చేరడంపై ఆ జట్టు అభిమానులు, మాజీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో గతేడాది ప్లేఆఫ్స్‌ చేరిన ఆ జట్టు ఈసారి ఏకంగా తుదిపోరుకు దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే దిల్లీని అభినందిస్తూ మాజీ కెప్టెన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తనదైన శైలిలో ఓ ట్వీట్‌ చేశాడు. 2000 ఏడాదిలో ప్రముఖ బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ నటించిన ‘హర్‌ దిల్‌ జో ప్యార్‌ కరేగా’ సినిమాలోని ‘ఏసా పెహ్లీ బార్‌ హువా హై 17-18 సాలో మే’ పాట మీమ్‌ను జోడిస్తూ ట్వీట్‌ చేశాడు. 

‘ఫైనల్స్‌ చేరిన దిల్లీకి అభినందనలు. ఈ లీగ్‌లో నిరంతరాయంగా ఆడుతూ ఇప్పటివరకూ ఫైనల్స్‌ చేరని ఒకే ఒక్క జట్టు ఇప్పుడు అక్కడికి దూసుకెళ్లింది. 2020 ఇంకా ఎక్కువే చూపిస్తుంది’ అని పేర్కొన్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ధావన్‌(78), మార్కస్‌ స్టోయినిస్‌(38), షిమ్రన్‌ హెట్‌మైయిర్‌(42) చెలరేగారు. అనంతరం హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో కేన్‌ విలియమ్సన్‌(67), అబ్దుల్‌ సమద్‌(33) ధాటిగా ఆడడంతో ఒక దశలో లక్ష్యాన్ని చేరుకునేలా కనిపించింది. అయితే, స్టోయినిస్‌, రబాడ చివర్లో మెరుగైన బౌలింగ్‌ చేసి వార్నర్‌ టీమ్‌ను 172/8 స్కోరుకే పరిమితం చేశారు. దీంతో దిల్లీ మంగళవారం ముంబయితో ఫైనల్లో ఢీకొననుంది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని