వీళ్లు వ్యాక్సిన్‌ కోసం 2022 వరకూ ఆగాలి: WHO - WHO Says Healthy Young People Will Have to Wait till 2022 for Coronavirus Vaccine
close
Updated : 15/10/2020 21:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వీళ్లు వ్యాక్సిన్‌ కోసం 2022 వరకూ ఆగాలి: WHO

జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడుతున్నవారు.. మృతి చెందుతున్న వారి సంఖ్య తగ్గని నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఓ సూచన చేసింది. ఆరోగ్యంగా ఉన్న యువత కరోనా టీకా కోసం 2022 వరకూ ఆగితే బాగుంటుందని అభిప్రాయపడింది. ఈ ఏడాది ‘ఏప్రిల్‌ నెలలో కొవిడ్‌ ధాటికి అత్యధికంగా రోజులో 7500 మంది మృతి చెందగా ఆ సంఖ్య క్రమేణా 5 వేలకు తగ్గింది. అయినా పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది’ డబ్ల్యూహెచ్‌వో ముఖ్య శాస్ర్తవేత్త సౌమ్య స్వామినాథన్‌ అన్నారు.

ప్రపంచ దేశాల్లో ఇప్పటి వరకూ 38 మిలియన్ల మంది కరోనా బారిన పడగా.. 11 లక్షల మంది వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ఏకీభవించిన అభిప్రాయం మేరకు.. తొలుత వ్యాక్సిన్‌ను ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వారికి, పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తే బాగుంటుందని సౌమ్య అన్నారు. వయసు పైబడిన వారికి ఎక్కువగా ప్రమాదం పొంచి ఉందని వివరించారు. వీళ్లు కూడా వ్యాక్సిన్‌ అందే జాబితాలో ముందుండాలన్నారు. ఈ క్రమంలో ఆరోగ్యవంతమైన యువత టీకా కోసం 2022 వరకూ ఆగితే మంచిదని స్వామినాథన్‌ అభిప్రాయపడ్డారు.

హెర్డ్‌ ఇమ్యూనిటీ అనైతికం అని ఆమె అన్నారు. దీని వల్ల పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కరోనా కట్టడికి ఎప్పటి లాగే మాస్కులు ధరించడం, శానిటైజర్‌ వాడటం, భౌతిక దూరం పాటించాలని సౌమ్య స్వామినాథన్‌ సూచించారు. హెర్డ్‌ ఇమ్యూనిటీ గురించి కాకుండా వ్యాక్సిన్‌ అభివృద్ధిపై అందరం చర్చించాలన్నారు. 70 శాతం మందికి టీకాను అందించగలిగితే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని