కరోనా విషయంలో భారత్‌ విజ్ఞప్తి సరైనదే.. - WHO backs India regarding covid vaccine patent rules
close
Published : 19/10/2020 14:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా విషయంలో భారత్‌ విజ్ఞప్తి సరైనదే..

మద్దతు ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

జెనీవా: కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ సేకరణకు సంబంధించి అంతర్జాతీయ పేటెంట్‌ నిబంధనలను సడలించాలంటూ భారత్‌ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీవో)కు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న మేధో సంబంధ ఒప్పందాలు కరోనా కట్టడికి ఆటంకంగా మారతాయన్న భారత్‌, దక్షణాఫ్రికాల వాదన సరైనదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

కరోనా పరీక్షలు, వ్యాక్సిన్‌, చికిత్సలకు సంబంధించి అంతర్జాతీయ మేధో హక్కుల ఒప్పందాలను సరళతరం చేయాలని ఇరుదేశాలు డబ్ల్యుటీవోను అభ్యర్థించాయి. కరోనాను ఎదుర్కొనేందుకు పలు నూతన విధానాలను కనుగొంటున్న నేపథ్యంలో.. అవి అంతర్జాతీయ డిమాండుకు అనుగుణంగా సమృద్ధిగా, అందుబాటు ధరల్లో లభించేందుకు వీలుగా పేటెంట్‌ నిబంధనలను సడలించాలని ఈ దేశాలు కోరాయి. అమెరికాతో సహా బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ తదితర అగ్రదేశాలు టీకా‌ తయారీదారులతో ఇప్పటికే మిలియన్ల డోసుల కొనుగోలుకు ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఐతే పేద దేశాలు కరోనా కట్టడిలో వెనుకబడే అవకాశముందని.. దీనితో అక్కడి ప్రజల పరిస్థితి దిగజారుతుందని భారత్‌ వివరించింది.  

భారత్‌ చేసిన ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ చర్య వల్ల అన్నిదేశాల్లో కరోనా నివారణ సాధనాలు అందుబాటు ధరలో లభిస్తాయని సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌  అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, ఇతర కరోనా వ్యాక్సిన్‌ తయారీ సంస్థలకు ప్రోత్సాహకరంగా ఉండేందుకు.. తమ కరోనా పేటెంట్‌ నిబంధనలను సడలిస్తున్నట్టు ప్రముఖ ఫార్మా సంస్థ మోడెర్నా ఇటీవల ప్రకటించింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని